![]() |
![]() |
.webp)
కార్తీక దీపం సీరియల్ స్టార్ మా కొన్నేళ్లుగా అలరిస్తూ ఎంటటైన్ చేస్తోంది. ఇప్పుడు ఈ సీరియల్ చివరికి వచ్చేసింది. ఆరేళ్ళ పాటు ఎక్కడా బోర్ కొట్టించకుండా సాగిన ఈ సీరియల్ ఎంతో మంది మనసుల్ని దోచుకుంది. ఈ సీరియల్ ఈ వారంతో ముగిసిపోతుంది అనే విషయాన్ని ఇప్పటికే ఈ టీమ్ ప్రకటించింది. అందరికీ నచ్చే క్లైమాక్స్‌తో సీరియల్‌కు ముగింపు పలకబోతున్నట్లు చెప్పింది. ఫైనల్ డే షూటింగ్ అంటూ సీరియల్ లో విలన్ రోల్ చేసిన మోనిత టీమ్ మొత్తానికి స్వీట్స్ ని గిఫ్ట్ గా ఇచ్చింది.
ఇక ఇప్పుడు స్టార్ మాలో ప్రతీ ఆదివారం ప్రసారం అయ్యే "ఆదివారం విత్ స్టార్ మా పరివారం" ప్రొగ్రామ్‌లో కార్తీకదీపం సీరియల్‌కు ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి కార్తీక దీపం సీరియల్ మెయిన్ క్యారెక్టర్లు చేసిన వాళ్లంతా పార్టిసిపేట్ చేశారు. పరిటాల నిరుపమ్, ప్రేమీ విశ్వనాథ్, పిల్లలు శౌర్య, హిమ, సౌందర్య అందరూ వచ్చారు. వీరికి ఘనంగా సన్మానం చేశారు. ఈ ఫేర్ వెల్ కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో డాక్టర్ బాబు, దీప కలిసి డాన్స్ చేసి.. అందరిని ఆకట్టుకున్నారు. “ఇప్పుడే కుట్టింది చీమ.. డాక్టర్ బాబు అంటే నాకు ప్రేమ” అని కవిత్వం చెప్పి.. వంటలక్క వాహ్ అనిపించుకుంది.
ఇక ఈ సీరియల్ ఎండ్ ఐపోతోంది అంటే కాస్త బాధగా ఉందని నిరుపమ్ ఎమోషనల్ అయ్యాడు. ఆడియన్స్ అంతా కలిసి డాక్టర్ బాబు రీల్ ఫ్యామిలీకి గజమాల వేసి సత్కరించారు. చివరగా వంటలక్క కార్తీకదీపం సీరియల్ గురించి ఎమోషనల్ అవుతూ.. డాక్టర్ బాబుని ప్రేమగా హగ్ చేసుకుని ముద్దు పెట్టి ఏడ్చేసింది.
![]() |
![]() |